మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదేలేదు | - | Sakshi
Sakshi News home page

మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదేలేదు

Jan 19 2026 4:13 AM | Updated on Jan 19 2026 10:59 AM

మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదేలేదు

మద్యం నియంత్రణపై వెనక్కి తగ్గేదేలేదు

మునుగోడు : నియోజకవర్గంలో మద్యం నియంత్రణకు తాను తీసుకున్న నిర్ణయంపై తగ్గేదిలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో పలువురు మద్యం వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి మద్యం విక్రయాల సమయంలో మార్పులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలు పాడుచేసే వ్యాపారం చేయడం సరికాదని, కనీసం కొందరి ఆరోగ్యాన్ని అయినా కాపాడేందుకు తాను నిర్ణయించినా సమయాల ప్రకారం విక్రయాలు కొనసాగించాలని ఆదేశించారు. వైన్స్‌ యజమానులు మధ్యాహ్నం ఒంటి గంటకు దుకాణం తెరిచి, రాత్రి 9 గంటల వరకు విక్రయించాలన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్‌ రూముల్లో మద్యం తాగేందుకు అనుమతించాలని సూచించారు. మద్యం ప్రియులను కట్టడి చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కంటే అధికంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం విక్రయాలని విచ్చలవిడిగా కొనసాగనించే ప్రసక్తే లేదన్నారు.

ఫ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement