మహిళలకే 50 శాతం వార్డులు
నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని నల్లగొండ నగర పాలక సంస్థతోపాటు, ఇతర మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్‌లు ఖరారు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్‌లో శనివారం ఆరు మున్సిపాలిటీలు, నల్లగొండ నగరపాలక సంస్థలో వార్డులకు రిజర్వేషన్ల ఖరారు చేసి మాట్లాడారు. ప్రభుత్వ జీఓ ప్రకారం 2011 జనాభా ప్రాతిపదికన, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రిజర్వేషన్ కేటాయింపులు చేశామన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఎన్నికలు జరగనున్న ఆరు మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు గాను నిబంధనల ప్రకారం 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, చండూరు, దేవరకొండ ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


