మంత్రి చేతులమీదుగా నేడు పలు శంకుస్థాపనలు
నల్లగొండ : నల్లగొండలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు వీటీ టెంపుల్ వద్ద రూ.2 కోట్ల వ్యయంతో 24గంటలు నీటిని అందించే పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. 10.30 గంటలకు చింతల్, రామ్‌నగర్, రాజీవ్ పార్క్, మామిళ్లగూడెం పార్కుల అభివృద్ధి, ఎన్జీ కాలనీలో రూ.2.25 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను ఆయన ప్రారంభిస్తారు. ఎన్జీ కాలేజి నుంచి రామగిరి వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రేణుకాఎల్లమ్మ ఆలయంలో పూజలు
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతినిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్‌కుమారాచార్యులు, గాదే ఉమామహేశ్వరరావు, దామోదర్‌రావు పాల్గొన్నారు.
ఓటరు తుది జాబితా విడుదల
నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్‌కు సంబంధించిన ఓటరు తుది జాబితాను కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 48 వార్డుల్లో 180 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నీలగిరి కార్పొరేషన్‌లో మొత్తం 1,42,437 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో సీ్త్రలు 73,507, పురుషులు 68,874, ఇతరులు 56 మంది ఉన్నారని, వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీపీలు కృష్ణవేణి, సుకన్య, ఆర్వో శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
● జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత స్పష్టం చేశారు. శుక్రవారం జీజీహెచ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రికి నిత్యం వందలాది మంది రోగులు వస్తున్నారన్నారు. ప్రధానంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల కోసం.. క్లిష్టమైన రెఫరల్ కేసులు వస్తున్నాయని వారికి సరైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కొన్ని అనుకోని సంఘటనల్లో జరిగిన సమయంలో దుష్ప్రాచారం చేసే వారి విషయంలో.. మీడియా వాస్తవాలను తెలుసుకుని వార్తలు రాయాలన్నారు. ప్రజల ఆరోగ్యమే తమ లక్ష్యమని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ రవికాంత్ వర్మ, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి చేతులమీదుగా నేడు పలు శంకుస్థాపనలు
మంత్రి చేతులమీదుగా నేడు పలు శంకుస్థాపనలు


