గంజి శ్రీరేఖకు డాక్టరేట్
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణానికి చెందిన
గంజి శ్రీరేఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రకటించింది. శ్రీరేఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో డాక్టర్ జి. విద్యాసాగర్ మార్గదర్శకత్వంలో ‘ఇంపాక్ట్ ఆఫ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్ డబ్ల్యూ.ఎస్.ఆర్.టి. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. దీంతో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. శ్రీరేఖను ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు, తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, వెంకటరమణ, భర్త అమర్‌నాథ్ అభినందించారు.


