ఆధునిక పద్ధతుల్లో వరి సాగు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలోని ప్యారారం గ్రామానికి చెందిన చిమ్ముల మధుసూదన్‌రెడ్డి సేంద్రియ వ్యవసాయంతో పాటు వరి సాగులో డ్రమ్ సీడర్, విత్తనాలను వెదజల్లే ఆధునిక విధానాలు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తూ పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకుంటున్నారు.
నాలుగేళ్లుగా వెదజల్లే విధానంలోనే సాగు
బొమ్మలరామారం మండలంలో ఎక్కువ మంది రైతులు సాంప్రదాయ విధానంలోనే వరి సాగు చేస్తుండగా.. చిమ్ముల మధుసూదన్‌రెడ్డి మాత్రం అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేస్తున్నారు. ఆయన గత నాలుగేళ్లుగా తనకున్న 10 ఎకరాల్లో వెదజల్లే విధానంలోనే వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ సహాయంతో పురుగు మందులు పిచికారీ చేయిస్తున్నారు. అదేవిధంగా రైతుల నుంచి పశువుల పెంట కొనుగోలు చేసి సాగుకు ముందే పొలాల్లో వేసుకుని పూర్తిగా సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కరువు
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించకపోవడంతో డ్రమ్ సీడర్, వెదజల్లే విధానాలను గురించి వారికి తెలియడం లేదు. దీంతో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు.
వెదజల్లే విధానంలో రైతు మధుసూదన్‌రెడ్డి వేసిన వరి చేను
డ్రోన్ సహాయంతో పురుగు మందు పిచికారీ
చేయిస్తున్న మధుసూదన్‌రెడ్డి
నాలుగేళ్లుగా వెదజల్లే విధానంతో అధిక దిగుబడులు పొందుతున్న
రైతు మధుసూదన్‌రెడ్డి
డ్రోన్ ద్వారా రసాయనాలు పిచికారీ
చేస్తూ పలువురికి ఆదర్శం
ఆధునిక పద్ధతుల్లో వరి సాగు


