సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో ‘జయ’ విద్యార్థుల ప్
సూర్యాపేటటౌన్ : ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏఎస్ రావు 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు 14 మంది అత్యత్తుమ ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. 9వ తరగతిలో 21 ర్యాంకులు ప్రకటించగా అందులో ఆరుగురు, 10వ తరగతిలో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో ఎనిమిది మంది జయ పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. 9వ తరగతి నుంచి వై. వీక్షణ, 10వ తరగతి నుంచి వి. వైష్ణవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు.


