పల్లెల్లో క్రీడాపోటీలు
యాదగిరిగుట్ట: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కొత్తగా గెలిచిన సర్పంచ్‌ల ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఊరూ వాడా ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రధానంగా కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి బహుమతులు, పారితోషికాలు అందించారు. కనుమ వరకు కూడా వీటిని నిర్వహించనున్నారు. గెలుపోటములు ప్రధానం కాకుండా యువతలో ఉత్సాహం నింపేందుకు ఈ పోటీలు చేపట్టారు.


