దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలి
శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కందాల ప్రమీల అన్నారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న జీపు ప్రచార యాత్రను మంగళవారం ఆమె శాలిగౌరారం మండల కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, వీబీ జీ రాంజీ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లుల రద్దుకు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షుడు బొజ్జ చినవెంకులు, చలకాని మల్లయ్య, ఆంజనేయులు, జగన్, జ్యోతిబస్, వెంకన్న, రామచంద్రు, నర్సింహ, ఇస్మాయిల్, సత్తెమ్మ పాల్గొన్నారు.


