అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారు
మేము ముగ్గురు సోదరులం. మా తండ్రి పేరు మీద 7.36 ఎకరాల భూమిని మూడు బాగాలుగా చేసుకుని 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. నాకు తెలియకుండా నాకు రావాల్సిన భూమిని నా సోదరులు నర్సిరెడ్డి, యాదగిరిరెడ్డి వారి పేరు మీదకు మార్చుకున్నారు. నాకు 75 సంవత్సరాలు, నడవలేను. ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు అంధురాలు, రెండో కూతురికి 23 ఏళ్ల క్రితం వివాహమైంది. నా భార్య కూడా వృద్ధురాలు. నా అంధురాలైన కూతురితో కలిసి వ్యవసాయం చేయించుకుంటున్నా. అధికారులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలి. – పబ్బతిరెడ్డి లక్ష్మారెడ్డి, అప్పాజిపేట(మిర్లోనిగూడెం), నల్లగొండ మండలం


