ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను పక్కనపెట్టిన అధికారుల
నల్లగొండలోనే అత్యధిక ఓటర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఓటర్ల జాబితాపై వెల్లువెత్తిన అభ్యంతరాలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 1వ తేదీన మున్సిపాలిటీ వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయి జాబితాలపై ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఓటు హక్కు పక్క వార్డులో ఉందని, తాము ఉంటున్న వార్డుకు మార్చాలని, ఇంటి నంబర్లు మార్చాలంటూ అభ్యంతరాలు పలువురు వ్యక్తం చేశారు. అయితే అందులో కొన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, పరిష్కరించారు. మరికొన్నింటిని మాత్రం తిరస్కరించారు. ఇలా జిల్లాలో ఐదు వందలకు పైగా అభ్యంతరాలు తిరస్కారానికి గురయ్యాయి. ఇక, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కల తేలింది. 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,68,437 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో పురుషులు 3,23,647 మంది, మహిళలు 3,44,661 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 129 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను, 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
16న ఫొటో ఓటర్ల తుది జాబితా
ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకటించారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అలాగే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేశారు. ఫొటోలో కూడిన జాబితాల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసేందుకు మూడు రోజుల సమయం ఇచ్చారు. వాటన్నింటిని సరిచేసి, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అధికారులు మున్సిపాలిటీ వార్డుల వారిగా ప్రచురించనున్నారు.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దం కావడంతో ఎన్నికల సంఘం ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనుంది. ఆ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోనే షెడ్యూల్ రావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు.
మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు..
మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్ మొత్తం
నల్లగొండ 68,874 73,507 56 1,42,437
మిర్యాలగూడ 45,128 47,878 14 93,020
దేవరకొండ 11,629 12,200 1 23,830
హాలియా 6,270 6,529 2 12,801
నందికొండ 6,475 7,027 1 13,503
చండూరు 5,652 5,717 1 11,370
చిట్యాల 5,930 6,188 1 12,118
సూర్యాపేట 52,170 56,664 14 1,08,848
కోదాడ 28,069 30,520 12 58,601
హుజూర్‌నగర్ 14,257 15,731 8 29,996
నేరేడుచర్ల 6,629 7,116 1 13,746
తిరుమలగిరి 7,638 7817 0 15,455
భువనగిరి 23,037 24,793 1 47,831
చౌటుప్పల్ 13,553 13,663 0 27,216
యాదగిరిగుట్ట 6,760 7,046 16 13,822
పోచంపల్లి 7,799 8,028 0 15,827
మోత్కూర్ 7,106 7,277 0 14,383
ఆలేరు 6,671 6,960 1 13,632
మొత్తం 3,23,647 3,44,661 129 6,68,437
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నల్లగొండలోని మున్సిపాలిటీల పరిధిలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో నకిరేకల్ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో 3,09,080 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,49,958 మంది పురుషులు, 1,59,046 మంది మహిళలు, 76 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
ఫ 18 మున్సిపాలిటీల్లో ఓటరు
తుది జాబితా ప్రకటన
ఫ ఉమ్మడి జిల్లాలో 6,68,437 మంది మున్సిపల్ ఓటర్లు
ఫ నేడు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
ఫ 16వ తేదీన ఫొటోలతో కూడిన
ఓటరు తుది జాబితా ప్రదర్శన


