వివేకానంద.. యువతకు ఆదర్శం
మర్రిగూడ(చింతపల్లి) : స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సోమవారం మాల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వివేకానంద యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, కర్తవ్య బోధనను పెంపొందించారని అన్నారు. వివేకానంద బోధనలు ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. విద్య, సంస్కృతి, జాతీయభావం పరిరక్షణలో స్వామి వివేకానంద ఆలోచలను ఎప్పటికీ ఆచరణీయమన్నారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్‌ను సిరిసిల్లలో ఓడించే బాధ్యత నాదే
బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తే సిరిసిల్లలో కేటీఆర్‌ను గెలవకుండా చేస్తానని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కేటీఆర్‌కు ఉద్యమాలు చేయడం చేతకాదని ఆయన సొంత చెల్లె కవిత చెప్పిందని అన్నారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కంటే బీజేపీ నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. వాస్తవాలు విస్మరించి గ్రౌండ్‌రిపోర్ట్‌కు విరుద్ధంగా కేటీఆర్ బీజేపీకి బలం లేదని విమర్శించడం ఆయన అవగాహన రాహిత్యమన్నారు. అధికారం కోల్పోయాక తన మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.
ఫ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు


