మమ్మల్ని ఆదుకోండి సారూ..
నల్లగొండ : మమ్మల్ని ఆదుకోండి సారూ.. అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టరేట్‌కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నా కూతురు వరలక్ష్మీ 9వ తరగతి చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం స్కూల్‌లో మెట్లపై నుంచి పడి మెదడుకు దెబ్బ తగిలింది. అప్పట్లో సదరం సర్టిఫికెట్ 30 శాతం ఇచ్చారు. ప్రస్తుతం ఉస్మానియాలో బ్రెయిన్ ఆపరేషన్ అయింది. సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో ఉన్న సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో చూపుతున్నందున వికలాంగుల పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలి.
– నాగమ్మ, పోతిరెడ్డిపల్లి, పీఏపల్లి మండలం
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళను. నాకు ఆస్తి పాస్తులు లేవు. సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. చేతికర్రలతో నడుస్తున్నాను. ఇప్పుడు నడవలేకపోతున్నాను. బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి.
– కుందూరు పద్మ, దుగ్గిరాల,
త్రిపురారం మండలం
ఫ ప్రజావాణిలో బాధితుల విన్నపం
ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్
మమ్మల్ని ఆదుకోండి సారూ..
మమ్మల్ని ఆదుకోండి సారూ..


