నిధులు దుర్వినియోగం కాకుండా..
భువనగిరి: నేను వ్యవసాయం చేస్తున్నా. పెంచికల్‌పహాడ్ గ్రామంలో సర్పంచ్ బరిలో యువత ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అయితే అమలుకు సాధ్యంకాని పనుల విషయంలో ముందుగానే హామీ ఇవ్వలేనని సూటిగా చెప్పా. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక, పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తా. అవసరమైన చోట్ల సీసీ రోడ్డు నిర్మాణాలు, అండర్ డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతా. గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా పనిచేస్తా. – మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్,
పెంచికల్‌పహాడ్, భువనగిరి మండలం


