స్వయం ఉపాధికి ప్రోత్సాహం
తిప్పర్తి: యువత స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. గ్రామస్తులు ఆదరించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, నిరంతరం వారి వెంట ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తా. గ్రామంలో ఇప్పటికే సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాం. తాగు నీరు, విద్యుత్, డ్రెయినేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తా.
– హేమలత, పజ్జూరు సర్పంచ్


