బహిరంగ సభను జయప్రదం చేయాలి
దేవరకొండ : ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న సీపీఐ బహిరంగసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దేవరకొండలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎర్ర జెండా ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ గలమెత్తిన పార్టీ సీపీఐ అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కనకాచారి, పల్లె నర్సింహ, తూం బుచ్చిరెడ్డి, దేప సుదర్శన్‌రెడ్డి, వెంకటయ్య, వెంకటరమణ, జయరాములు, నూనె రామస్వామి, వలమల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


