డ్రాయింగ్ పరీక్ష ప్రశాంతం
నల్లగొండ టూటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు రెండవ రోజు ఆదివారం నల్లగొండలో డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ హైయర్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 875 మంది అభ్యర్థులు హాజరు కాగా 241 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 993 మందికి గాను 760 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు.
రాష్ట్ర కబడ్డీ జట్టు
కెప్టెన్‌గా కార్తీక్
హాలియా : హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన తగుళ్ల కార్తీక్ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 16 వరకు హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో జరిగే అండర్–19 జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నారు. తనను ప్రోత్సహించిన అనుముల స్పోర్ట్ క్లబ్ కబడ్డీ కోచ్ కాకునూరి రాము, నరేష్, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి డోమినిక్, పీడీ వెంకటరామిరెడ్డి, రమేష్‌గౌడ్‌కి కార్తీక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాత పింఛన్ కోసం పోరాటం
నల్లగొండ : పాత పింఛన్ విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని ఆలిండియా న్యూ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐఎన్‌పీఎస్‌ఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకంలో ఉన్నారని తెలిపారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్య పింఛను పథకం ప్రారంభం అయ్యిందన్నారు. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగికి ఆర్థిక, సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
శివన్నగూడెం పనుల అడ్డగింత
మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడెంలో నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పనులను నడవనీయమని హెచ్చరించారు.
ప్రజాకవి అలిశెట్టి జయంతి
రామగిరి(నల్లగొండ): సమాజాన్ని ప్రభావితం చేసే ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు అరుదుగా ఉంటారని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్ అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో అలిశెట్టి ప్రభాకర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు పున్నమి అంజయ్య, నర్సింహ, లింగస్వామి, అంజయ్య, గిరి, రాములు, లింగమూర్తి, కొండ కృష్ణ, జగదీష్, శ్రీనివాసరావు, కలీం, మహ్మద్ పాషా, శంకరయ్య పాల్గొన్నారు.
డ్రాయింగ్ పరీక్ష ప్రశాంతం
డ్రాయింగ్ పరీక్ష ప్రశాంతం


