45 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
పెద్దఅడిశర్లపల్లి : గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1980–81 పదో తరగతి బ్యాచ్ ఆదివారం ఆ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో వీరు సుమారు 45 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకుని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వారి హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాధవరెడ్డి, నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం అన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు వడ్లపల్లి చంద్రారెడ్డి, విడియాల వెంకటేశ్వర్లు, పాశం శ్రీనివాస్‌రెడ్డి, సామ వెంకటేశ్వర్‌రెడ్డి, సముద్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


