పద్మానగర్ జంక్షన్ మూసివేత
హైదరాబాద్ –విజయవాడ జాతీయ రహదారిపై బాక్ల్ స్పాట్‌గా ఉన్న నకిరేకల్ పట్టణ శివారులోని పద్మానగర్ జంక్షన్ క్రాసింగ్‌ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. సంక్రాంతి పండుగు నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం.. ఈ జంక్షన్ వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తూ నకిరేకల్ నుంచి హైదారాబాద్ వైపునకు ఆర్టీసీ బస్సులతో పాటు, ఇతర వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి. రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందుస్తుగా స్థానిక పోలీసులు ఈ రోడ్డు క్రాసింగ్‌ను మూసివేయించారు. నకిరేకల్ నుంచి నల్లగొండ, హైదరాబాద్ వైపునకు వేళ్లే వాహనదారులు చీమలగడ్డ అండర్ పాసింగ్ నుంచి తాటికల్ రోడు అండర్ పాసింగ్ సర్వీస్ రోడ్ల గుండా హైవే పైకి మళ్లీంచారు. పద్మానగర్ కాలనీ వాసులు నకిరేకల్‌కు రావాలన్నా చందంపల్లి ఫ్లైవర్ వంతెన పైనుంచి రావాలని నకిరేకల్ సీఐ వెంకటేశం సూచించారు.


