నిరాటోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నిరాటోత్సవాలు ప్రారంభం

Jan 11 2026 9:42 AM | Updated on Jan 11 2026 9:42 AM

నిరాటోత్సవాలు ప్రారంభం

నిరాటోత్సవాలు ప్రారంభం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవికి నిరాటోత్సవాలను అర్చకులు ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ నీరాటోత్సవాల్లో శ్రీస్వామి వారి నిత్య కల్యాణ సేవతో పాటు గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాఢ వీధుల్లో అమ్మవారి సేవతో పాటు శ్రీస్వామి వారి గజవాహన సేవను ఊరేగించారు.మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా పెట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 రాత్రి ఆలయంలో గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం, 15 ఉదయం 11.45గంటలకు వడి బియ్యం సమర్పించే వేడుకలను నిర్వహిస్తున్నామని అర్చకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement