వాహనదారులు హెల్మెట్ ధరించాలి
మిర్యాలగూడ అర్బన్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) చేపట్టిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. హెల్మెట్లను ఇళ్లలో గోడలకు, స్కూటీ డిక్కీల్లో పెట్టకుండా తలకు ధరించి వాహనం నడపాలన్నారు. సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ ఏ పని తలపెట్టినా పూర్తి అంకితభావంతో చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ మాట్లాడుతూ మానవ ప్రయత్నంగా ప్రస్తుతం 500 మందికి హెల్మెట్లు పంచినట్లు చెప్పారు. శివరాత్రి వరకు పట్టణంలో అందరికీ హెల్మెట్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు ప్రసాద్, నాగభూషణం, సోమనర్సయ్య, ఎన్‌ఐలు నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, పొదిల శ్రీనివాస్, కొమ్మన నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


