సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

Jan 11 2026 9:42 AM | Updated on Jan 11 2026 9:42 AM

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

నల్లగొండ టూటౌన్‌ : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టర్‌ ఎదుట నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, జిల్లాకార్యదర్శి అద్దంకి రవీందర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న, ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ అప్పల మధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జోగు అంజన్న, షేక్‌ చాంద్‌పాషా, చింత స్వామి పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్‌

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యమకారుల దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement