చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు

Jan 11 2026 9:42 AM | Updated on Jan 11 2026 9:42 AM

చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు

చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆలయంలో దుకాణాలతో పాటు వివిధ పనుల నిర్వహణ హక్కుల కోసం శనివారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈఓ కార్యాలయంలో వీటిని నిర్వహించారు. కొండపైన టోల్‌గేట్‌ నిర్వహణ, కొబ్బరిచిప్పల సేకరణ, టాయిటెట్‌ బ్లాక్‌ నిర్వహణ, కొండకింద కూల్‌డ్రింక్స్‌ షాపు, హోటల్‌, అమ్మవారి వస్త్రాల సేకరణ, క్యారీ బ్యాగుల విక్రయం, నందిసర్కిల్‌ వద్ద షాప్‌ నంబర్‌– 2, షాప్‌ నంబర్‌– 4, షాప్‌ నంబర్‌– 5, షాప్‌ నంబర్‌– 6, ఆవులకు పచ్చిగడ్డి అమ్ముకునే హక్కు కోసం వేలం నిర్వహించారు. టెండర్ల నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.1,87,34,528 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.1,21,36,777 రాగా ప్రస్తుతం వేసిన టెండర్లకు రూ. 65,97,751 అధికంగా వచ్చిందని ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్‌ నేతకాని కృష్ణయ్య, దేవాలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరఽశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఆలయానికి రూ.1.87 కోట్ల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement