జిల్లా స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు
రామగిరి(నల్లగొండ): పట్టణంలోని డైట్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భాషా నైపుణ్యాలు అభివృద్ధి పరిచే కార్యక్రమంగా ఒలంపియాడ్, ఎడ్యుటాక్ అంశాలతో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ, ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ.అబ్బాస్, ప్రధాన కార్యదర్శి కె.బాలరాజు, ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎం.అనిల్‌కుమార్, కోశాధికారి ఏ.రాధాకిషన్, ఎన్.విష్ణు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


