చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి

Jan 10 2026 9:30 AM | Updated on Jan 10 2026 9:30 AM

చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి

చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి

నార్కట్‌పల్లి : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దేవాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, నీరు, బారికేడ్లు, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎక్కువ శాతం సిబ్బందిని కేటాయించాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టు పైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయానికి రూ.వంద కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామని, వచ్చే నెలలో సీఎం రేవంత్‌రెడ్డితో శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కొనసాగించాలని తెలిపారు. హయత్‌నగర్‌ నుంచి నేరుగా చెర్వుగట్టుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఈఓ మోహన్‌బాబు, సర్పంచ్‌ నేతగాని కృష్ణ, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement