నీలగిరిని స్మార్ట్‌ సిటీగా మారుస్తా.. | - | Sakshi
Sakshi News home page

నీలగిరిని స్మార్ట్‌ సిటీగా మారుస్తా..

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

నీలగి

నీలగిరిని స్మార్ట్‌ సిటీగా మారుస్తా..

నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్‌ తొలి మేయర్‌ పదవిని కాంగ్రెస్‌ కై వసం చేసుకునేలా అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్‌–2 పథకం కింద రూ.1.45కోట్లతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం రూ.3.14కోట్లతో చేపట్టిన వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, లెప్రసీ కాలనీలో రూ.3కోట్లతో సబ్‌స్టేషన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. లతీఫ్‌సాబ్‌గుట్ట వద్ద రూ.50లక్షలతో నిర్మించిన పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ–2 యూనిట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి నల్లగొండ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అశోక్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్‌, వంగూరి లక్ష్మయ్య, నారగోని నవీన్‌కుమార్‌గౌడ్‌, కమిషన్‌ ముసాబ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

రామగిరి(నల్లగొండ): రైతులకు నాణ్యమైన విద్యు త్‌ అందించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం దోనకల్లులో నిర్మించిన 33 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కోమటిరెడ్డి పృథ్వీధర్‌రెడ్డి, దోనకల్‌, పాతూరు సర్పంచ్‌లు కొత్తపల్లి సునితమధు, దోటి పద్మపరమేశ్‌ పాల్గొన్నారు.

ఫ తొలి మేయర్‌గా

కాంగ్రెస్‌ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నీలగిరిని స్మార్ట్‌ సిటీగా మారుస్తా..1
1/1

నీలగిరిని స్మార్ట్‌ సిటీగా మారుస్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement