డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను సుమారు 500పైగా ఉన్న ఓపెన్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయి. బంగారుగడ్డ, హనుమాన్‌పేటలో ప్రధాన నాలాలు కొన్నిచోట్ల ఆక్రమణకు గురై రెండు ఫీట్ల మేరకే ఉన్నాయి. బంగారుగడ్డ నుంచి వచ్చే ప్రధాన నాలాలోకి సమీప గృహాల వారు మరుగుదొడ్ల పైపులు వదిలివేయడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలాలు చాలాచోట్ల ధ్వంసం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు లేక ప్రమాదకరంగా మారాయి. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.


