వేధిస్తున్న సిబ్బంది కొరత
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణంలో మొత్తం 20 వార్డుల్లో మెయిన్ రోడ్డులో బాబాసాహెబ్‌గూడెం నుంచి పటేల్‌నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినీజీ నిర్మించారు. మిగతా అన్ని వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది 71 మంది ఉన్నారు. జనాభా పరంగా మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బంది కొరతతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీల్లో ముగురు పేరుకుపోయి దుర్వాసనమయంగా మారాయి.


