సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

సూక్ష

సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు

సేంద్రియ ఎరువులు వాడాలి

త్రిపురారం : పంటల పెరుగుదలకు సూక్ష్మపోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సూక్ష్మపోషకాల లోపం వలన నేలలు చౌడుగా మారి పంటల దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రైతులు సాధ్యమైనంత మేర ఎరువులు వేసుకొని పంటలపై సూక్ష్మపోషకాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు చేపడితే సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించవచ్చని కంపాసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ సూచిస్తున్నారు.

జింకు లోపం : జింకు లోపం ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాల్లో అధికంగా కనిపిస్తుంది. వరిలో జింక్‌ లోపం భాస్వరం ఎక్కువగా వేసిన పొలాలు, చౌడు నేలలు, మాగకుండా సేంద్రీయ పదార్థాలు అధికంగా వినియోగించిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం వలన వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్కపై నుంచి 3 లేదా 4 ఆకుల నడుమ ఈను తెల్లగా పాలిపోతుంది. ఆ తర్తా ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిపార్లు ఏవిధమైన లోపాలు కనిపించకున్నా.. నత్రజని, భాస్వరం, తగినంత మోతాదులో వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల నడుమ ఈనెకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. పప్పుధాన్యాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. లేత ఆకుపచ్చ మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కనువులు దగ్గరగా ఉండి మొక్కల పెరుగుదల ఆలస్యంగా పెరుగుతుంది.

నివారణ చర్యలు

సాధారణ నేల్లో మూడు పంటలకు ఒకసారి.. కొత్తగా ఆయకట్టు కింద సాగుచేసే నేలల్లో, చౌడు, ఉప్ప నేలల్లో రెండు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ను వేయాలి. పంటలో జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్‌ను కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని 2 నుంచి 3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి పంటకు ముందు వేస్తే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు.

ఇనుము లోపం : ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో లేదా సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కనిపిస్తుంది. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతాయి. లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది.

నివారణ చర్యలు

పంటల్లో ఇనుము లోపం గుర్తించినప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేదిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిసేలా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

బోరాన్‌ లోపం : వరిలో బోరాన్‌ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్‌ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. బోరాన్‌ లోప స్థాయి లేదా విషమ స్థాయి మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్‌ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటలకు బోరాన్‌ను అందించాలి. పత్తి పండించే నేలల్లో కూడా బోరాన్‌ లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్‌ లోపం సర్వ సాధారణంగా ఉంటుంది.

నివారణ చర్యలు

బోరాన్‌ లోపం నివారణకు ఎకరాకు రెండు కిలోల బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు రెండుసార్లు 0.15 శాతం బోరాక్స్‌ను 60 లేదా 90 రోజులకు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పూవ్వులల్లో మధ్యభాగం గింజ కట్టదు. వేరుశనగలో గింజ మధ్యభాగం తోడుకోదు. ఈ లోపాన్ని నివారించడానికి 0.1 శాతం బోరిక్‌ ఆమ్లాన్ని ఒక లీటరు నీటికి కలిపి పంట వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.

రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగించడం పెంచడం వల్ల భూమిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. నేలలోనే కాకుండా పంటపై కూడా లోపాలను సరిచేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి ఉపఝెగించడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని రైతులు గమనించాలి.

ఫ కంపాసాగర్‌ కృషి విజ్ఞాన

కేంద్రం కోఆర్డినేటర్‌

చంద్రశేఖర్‌ సూచనలు

సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు1
1/1

సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement