భవనాలు ఎక్కువ.. రాబడి తకు్కవ! | - | Sakshi
Sakshi News home page

భవనాలు ఎక్కువ.. రాబడి తకు్కవ!

Aug 4 2025 4:22 AM | Updated on Aug 4 2025 4:48 AM

భవనాలు ఎక్కువ.. రాబడి తకు్కవ!

భవనాలు ఎక్కువ.. రాబడి తకు్కవ!

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి పట్టణంలో ఉన్న భవనాలకు తగ్గట్టుగా మున్సిపాలిటీకి వాటి ద్వారా ఆదాయం రావడంలేదు. పట్టణ శివారు పెరగడంతో పాటు ఆయా కాలనీల్లో ఐదారు అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టడం, ఇటీవల పట్టణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు భారీగా వెలిసిన విషయం తెలిసిందే. పెరిగిన పట్టణం కారణంగా సేవలు పెరగడంతో పాటు మున్సిపాలిటీకి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆదాయం సమకూరకపోవడంతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పట్టణంలో 48 వార్డులు

మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 43 వేల భవనాలకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ 43 వేల భవనాల ద్వారా అనుకున్న స్థాయిలో ఆస్తి పన్ను రావడంలేదు. 10 సంవత్సరాల నుంచి ఆస్తి పన్ను ద్వారా కచ్చితంగా రావల్సిన ఆదాయం కోల్పోతోంది. 43 వేల భవనాలకు దాదాపుగా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను సమకూరాల్సి ఉంటుంది. కానీ ప్రసుతం ఆస్తి పన్ను ద్వారా రూ.18 కోట్లు మాత్రమే వస్తోంది. కొన్ని చోట్ల స్థానిక నాయకుల జోక్యం, కొందరి మున్సిపల్‌ సిబ్బంది చేతివాటం కారణంగా మున్సిపాలిటీ ఆదాయం కోల్పోవాల్సి వస్తుందనేది బహిరంగ రహస్యమే.

ఐదు అంతస్తులున్నా..

ఒకటి రెండింటికే పన్ను చెల్లింపు

నీలగిరి పట్టణంలోని షాపింగ్‌ కాంప్లెంక్స్‌లు, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్‌ ఆస్పత్రులు, కార్ల షోరూమ్‌లను రీ అసెస్‌మెంట్‌ చేస్తే ఆస్తి పన్ను పెరగనుంది. నాలుగైదు అంతస్తుల భవనాలు ఉన్న వారు ఒక అంతస్తు, రెండస్తులకు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌ రోడ్‌లోని ఓ బైక్‌ షోరూం భవనం ఐదు అంతస్తులు ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఇదే రోడ్‌లో మరో బైక్‌ షోరూం వారు అన్ని అంతస్తులకు కాకుండా మూడు అంతస్తులకు రూ.లక్ష మాత్రమే వస్తోంది. అదే విధంగా బోయవాడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఐదంతస్తుల భవనం ఉండగా, కేవలం రెండంతస్తులకు మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిసింది. రామాలయంలో సమీపంలోని ఓ కార్పొరేట్‌ షాపింగ్‌ మాల్‌ భవనం, దానికి సమీపంలోనే ఉన్న మరో షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఎన్జీ కాలేజీ సమీపంలో ఉన్న ఓ మాల్‌ భవనం, ఎల్‌వీ బంక్‌ సమీపంలో ఉన్న మరో రెండు భవనాలు ఇలా అనేక భవనాలకు ఆస్తి పన్ను చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇలా ఒక్కటి రెండు కాదు కార్పొరేట్‌ మాల్స్‌, పాత భవనాల స్థానంలో కొత్తగా నిర్మించిన దుకాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసెస్‌మెంట్‌ చేస్తే ఆస్తి పన్ను రూ.18 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా మున్సిపల్‌ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఫ నీలగిరిలో 43 వేల భవనాలు

ఫ ఆదాయం మాత్రం రూ.18 కోట్లే..

ఫ రీ అసెస్‌మెంట్‌ చేస్తే మున్సిపాలిటీ ఆదాయం పెరిగే అవకాశం

మున్సిపాలిటీలో పెరిగిన ఖర్చులు

పట్టణంలో పెరుగుతున్న జనాబాకు అనుగుణంగా సేవలందించడం కోసం మున్సిపాలిటీ కొత్తగా జేసీబీలు, ట్యాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు చేయడంతో నిర్వహణ కూడా భారీగా పెరిగింది. ఆ ఖర్చులకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయం పెంచుకునే వెసులుబాటు ఉన్నా ఆ దిశగా దృష్టి సారించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మున్సిపల్‌ సిబ్బంది ఆస్తి పన్ను మదింపు చేయడానికి వెళ్తే స్థానిక నాయకులు ఆపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రీ మదింపు వలన స్థానిక నాయకులకు ఎలాంటి నష్టం జరిగే అవకాశమే లేదు. ఎందకంటే భారీ భవనాలు, సముదాయాలు కట్టిన వారికి ఆ వార్డులో ఓట్లు లేవు అనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement