
బ్యాకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చిట్యాల : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు భద్రతతో కూడిన మెరుగైన బ్యాకింగ్ సేవలతోపాటు బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అమర రామమోహన్‌రావు కోరారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి నిర్వహించిన జన సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తుల ద్వారా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా యాబై కోట్ల మంది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈ బ్యాంకు ఖాతాదారులు ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగాను తప్పనిసరిగా పదేళ్లకోసారి రీ–కేవైసీ చేయించుకోవాలని, ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బీమా పథకాలను అతి తక్కువ ప్రీమీయంతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ డిజిటల్ బ్యాకింగ్ సిస్టమ్‌ను మరింత పెంపొందించాలని, వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులకు తెలియజేయవద్దని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు నెట్‌వర్క్ ఇన్‌చార్జి జనరల్ మేనేజర్లు రవికుమార్‌వర్మ, సతీష్‌కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియభ్రత మిశ్రా, డీసీఎం కే.శివక్రిష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్, చిట్యాల బ్రాంచి మేనేజర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ ఎస్‌బీఐ ఎండీ అమర రామమోహన్‌రావు