
‘ఉత్తి’పోతలేనా!
నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం
మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిధిలో కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకాల పనులు సాగుతున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవం. నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేయడం ఆలస్యమవుతోంది. నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాపం. పనుల వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటాం.
– కర్నాకర్, ఎన్‌ఎస్పీ ఈఈ
మిర్యాలగూడ : సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో అందులో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. వీటి పనులు ప్రారంభించి ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఫలితంగా చివరి భూములకు నీరండం లేదు.
ఎన్‌ఎస్పీ పరిధిలో..
మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో చివరి భూములకు నీరందించేందుకు ఆరు ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టారు. ఎన్‌ఎస్పీ డివిజన్–1 పరిధిలో సాగర్ డ్యాం ఉండగా ఎన్‌ఎస్పీ డివిజన్–2 పరిధిలో ఐదు లిఫ్టులను మంజూరు చేశారు. అందులో నెల్లికల్, బొత్తలపాలెం– వాడపల్లి, దున్నపోతులగండి, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్టులు ఉన్నాయి. డివిజన్–3 పరిధిలో కేశవాపురం – కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఈ ఆరు ఎత్తిపోతల పథకాల్లో 9 పంప్‌హౌజ్‌లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల వద్ద మాత్రమే ఒక పంప్‌హౌజ్ పూర్తయింది.
నిధులు మంజూరులో జాప్యం
ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించినప్పటికీ పనుల పురోగతికి అనుగుణంగా నిధులు మంజూరు కాకపోవడంతో వాటి పనులు నిలిచిపోతున్నాయి. నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.664.80 కోట్లతో చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.131.420 కోట్ల పనులు జరిగాయి. ఇలా బొత్తలపాలెం, దున్నపోతలగండి, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
ఫ ఐదేళ్ల క్రితం ఆరు ఎత్తిపోతల
పథకాల పనులు ప్రారంభం
ఫ ఇప్పటి వరకు
30 శాతం కూడా పూర్తికాలే..
ఫ నిధుల లేమితో ముందుకు
సాగని పనులు
ఫ ఆయకట్టు చివరి భూములకు
అందని నీరు
ఎత్తిపోతల పథకాల వివరాలు ఇలా..
లిఫ్టు నిధులు ఆయకట్టు పనుల పురోగతి
(రూ.కోట్లలో)
నెల్లికల్ 664.80 24,624 24.34 శాతం
బొత్తలపాలెం 229.25 8,610 11 శాతం
వీర్లపాలెం 32.22 2500 10 శాతం
తోపుచర్ల 9.3 315.98 10 శాతం
దున్నపోతులగండి 219.9 12,239 12 శాతం
కేశవాపురం 53 5875 30శాతం

‘ఉత్తి’పోతలేనా!