
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం
డిండి : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం డిండి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి ఎకరాకు సరిపడా నీరందిస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. అంతకుముందు స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రహరి గోడను ప్రారంభించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. వీఏఎస్ ఫంక్షన్ హాల్‌లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాెస్‌గౌడ్, ఎంపీడీఓ వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, రాజేష్‌రెడ్డి, గడ్డమీది సాయి, రాంకిరణ్, దామోద్‌రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, శ్రీను, వెంకటేష్, సలయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం