
అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తాం
చింతపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం చింతపల్లిలో నూతన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి మండలానికి 1,666 నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, మార్కెట్ చైర్మన్ దొంతం సంజీవరెడ్డి, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్యగౌడ్, ముచ్చర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
చందంపేట : కేజీబీవీ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం నేరెడుగొమ్ము మండల కేంద్రంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వంట గదిని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ ఉమాదేవి, ఎంపీడీఓ నీలిమ, ఎస్‌ఓ శ్వేత ఉన్నారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తాం