
4న ‘యంగ్ ఇండియా స్కూల్’కు శంకుస్థాపన
నల్లగొండ : జిల్లా కేంద్రంలో నిర్మించే య.ుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఆగస్టు 4న భూమి పూజ చేయనున్నారు. అదే రోజు మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. 22 ఎకరాల్లో 5,36,194 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్ల అంచనాతో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయనున్నామని మంత్రి వెల్లడించారు. భూమి పూజ తర్వాత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నల్లగొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షలో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పాల్గొన్నారు.
నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నల్లగొండ చేరుకొని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలువనున్నారు. 11 గంటలకు ఎస్‌ఎల్‌బీసీలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ రోగులను కలుస్తారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలిస్తారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి