
‘విదేశీ విద్య’కు మరింత ప్రోత్సాహం
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం సీట్లను పెంచింది. ఇప్పటి వరకు 210 సీట్లు ఉండగా.. 500 సీట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరింత మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్య అందనుంది.
2013లో ప్రారంభం
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు 2013లో అప్పటి ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సిస్ విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపట్టింది. ఈ పథకం కింద విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు చెల్లించింది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచారు. విదేశాల్లో చదివేందుకు సంబంధిత పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద విదేశీ విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఈ పాస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆయా ప్రాధాన్యత ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తుంది.
72 మందికి అవకాశం
అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం కింద ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికే అవకాశం దక్కింది. 12 సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది విదేశాల్లో చదువుకునేందుకు రికమండ్ చేశారు. వారిలో 71 మందికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. జిల్లాలో మొత్తం రూ.6.49 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం విదేశీ విద్య కోసం ఖర్చు చేసింది.
దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు..
విదేశీ విద్యను అభ్యసించేందుకు 2025–26 సంవత్సరానికి సంబంధించి అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అవకాశాన్ని అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
జిల్లాలో అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం కింద విదేశాలకు వెళ్లిన విద్యార్థులు
సంవత్సరం దరఖాస్తులు రిజెక్టు విదేశాలకు
వెళ్లింది
2013–14 1 0 1
2014–15 5 0 5
2015–16 7 3 4
2016–17 14 6 8
2017–18 10 5 5
2018–19 4 1 3
2019–20 8 1 7
2020–21 4 1 3
2021–22 12 1 11
2022–23 33 20 13
2023–24 28 21 7
2024–25 18 13 5
మొత్తం 144 72 72
ఫ అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధికి
గతంలో కంటే రెట్టింపు సీట్లు
ఫ మరింత మందికి
అందనున్న విదేశీ విద్య
ఫ జిల్లాలో ఇప్పటి వరకు
72 మందికి అవకాశం