
సంక్షేమమే ప్రభుత్వ అభిమతం
కట్టంగూర్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి నూతన రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 84 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం అందజేయటం దేశంలోనే చారిత్రాత్మకం అన్నారు. గతంలో రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉండగా ప్రస్తుతం 97 లక్షలకు పెరిగాయన్నారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్‌కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అర్హులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయిటిపాముల ఎత్తిపోతల పథకం కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణ బిల్లులను మంజూరు చేయాలని, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ కింద ఉన్న భూ సేకరణ నిధులు విడుదల చేయాలని ఆమె మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్‌డీఓ వై.అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్‌రావు, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకబోయిన నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, డీటీ ఆల్‌బర్ట్ ఫ్రాంక్లిన్, ఆర్‌ఐ కుమార్‌రెడ్డి, శ్యామల శ్రీనివాస్, బెజవాడ సైదులు, ఐతగోని నర్సింహ్మ, వివిధశాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
పెద్దవూర : రాష్ట్రంలో రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఇది కొనసాగుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా 62,155 మందికి నూతన రేషన్ కార్డులను మంజూరు చేశామని, 80,201 మంది పేర్లను నమోదు చేసినట్లు చేశామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సివిల్ సప్లయీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎంసీ చైర్మన్ టి.చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, పబ్బు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.