
మూసీ క్రస్ట్‌గేట్లు మూత
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గింది. దీంతో మంగళవారం ప్రాజెక్టు అధికారులు క్రస్ట్‌గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 1,650 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. మంగళవారం ఉదయానికి 950 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ఐదు రోజులుగా తెరిచి ఉంచిన రెండు క్రస్ట్‌గేట్లను మంగళవారం ఉదయం పూర్తిగా మూసివేశారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.18 అడుగుల (.94 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 547 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది.
స్వస్థలాలకు
వలస కార్మికులు
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ కృష్ణా తీరంలో నిర్బంధం నుంచి విముక్తి పొందిన వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపుతున్నారు. మొత్తం 28 మంది కార్మికులను బిహార్, ఛత్తీస్‌ఘడ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని వారివారి ప్రాంతాలకు మంగళవారం దేవరకొండ నుంచి బయల్దేరి వెళ్లినట్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు.
31న యోగాసన
ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్ : జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నల్లగొండలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగానికి చెందిన ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట సింహాద్రికుమార్, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 31న ఉదయం 10 గంటలకు బోనపైడ్, ఆధార్‌కార్డులతో నల్లగొండలోని ఫణి విహార్‌లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 91820 46383 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
టీటీసీ హాల్‌టికెట్లు
డౌన్‌లోడ్ చేసుకోవాలి
నల్లగొండ : టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bse .telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఆగస్టు 3వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పేపర్–1 (ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ థియరీ), మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పేపర్–2 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్), 3.30 గంటల నుంచి 4.30 వరకు పేపర్ –3 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్) పరీక్షలు ఉంటాయని తెలిపారు.

మూసీ క్రస్ట్‌గేట్లు మూత