
టెయిల్‌పాండ్ నుంచి నీటి విడుదల
అడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో కృష్ణానదిపై ఉన్న టెయిల్‌పాండ్ నుంచి దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ వెంకటరమణ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి టెయిల్‌పాండ్‌కు 2,32,468 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో దిగువకు 2,38,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 75.50 (7.080 టీఎంసీలు)మీటర్లు కాగా.. ప్రస్తుతం 75.04(6,764 టీఎంసీలు) మీటర్ల మేరకు నీరు ఉందన్నారు. కార్యక్రమంలో టెయిల్‌పాండ్ అధికారులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, అవినాష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.