
డెంగీ పేరుతో ప్రజలను భయపెట్టొద్దు
నల్లగొండ : ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ వ్యాధి పేరుతో ప్రజలను భయపెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. డెంగీ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా చేసిన ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి వైద్యాధికారి సమీపంలోని పాఠశాల, హాస్టల్‌ను తప్పనిసరిగా సందర్శించి అవసరమైతే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి