
ఏఐ టీబీ ఎక్స్‌రే పరికరం కొనుగోలుకు ఆర్థిక సాయం
నల్లగొండ : నల్లగొండలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో టీబీ కేసులను నిర్ధారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ టీబీ ఎక్స్‌రే పరికరం కొనుగోలు కోసం రూ.18 లక్షల చెక్కును మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు గంటా సంతోష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, నల్లగొండ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి భద్రాద్రి తదితరులు పాల్గొన్నారు.