
కాల్వలకు హద్దుల నిర్ధారణ
నకిరేకల్ : ఏఎమ్మార్పీ డి–53 కాల్వ భూములకు అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. ఈనెల 21న ‘సాక్షి’లో ‘కాల్వకట్టలు కబ్జాల మయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 291, 292లలో కబ్జాకు గురైన కాల్వలను సోమవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు బోళ్ల శ్యాం, చిరంజీవి, ఇరిగేషన్ అదికారులు సాయికృష్ణ, వర్క ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పరిశీలించారు. కాల్వలకు ఇరువైపులా సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. కాల్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

కాల్వలకు హద్దుల నిర్ధారణ