
హాస్టళ్ల అద్దె బకాయి!
యజమానుల అప్పులపాలు
ప్రభుత్వం ప్రతి నెలా అద్దె ఇస్తుందని యజమానులు హాస్టళ్లకు భవనాలు ఇచ్చారు. కానీ ఏడాదిన్నర నుంచి అద్దె రాకపోవడంతో ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భవనాల అద్దె మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు ప్రతినెలా బ్యాంకులకు భవనాల ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అద్దెలు చెల్లించపోవడంతో వారు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు భవనంలో చిన్నపాటి మరమ్మతు వచ్చినా అద్దె రాలేదనే కారణంతో యజమానులు బాగు చేయించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై ఎస్సీ డీడీ బి.శశికళను వివరణ కోరగా.. అద్దెకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అద్దె బకాయిలు రాగానే చెల్లిస్తామని పేర్కొన్నారు.
నల్లగొండ : కళాశాల హాస్టల్ భవనాలకు అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం హాస్టల్ భవనాలకు అద్దెను చెల్లించకపోవడం వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో చిన్న మరమ్మతు వచ్చిన యజమానులు చేయించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు తప్పడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 కళాశాల హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో నల్లగొండలో 5, దేవరకొండలో 2, మిర్యాలగూడలో 2, నకిరేకల్‌లో 1 హాస్టల్ ఉంది. వీటిలో 4 హాస్టళ్లు బాలికలకు, 6 హాస్టళ్లు బాలురవి ఉన్నాయి. ఈ హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.4,28,783 అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నకు పైగా అద్దె చెల్లించపోవడంతో రూ.74,68,821 బకాయిలు పేరుకుపోయాయి.
ఫ ఎస్సీ కళాశాల వసతి గృహాలకు కిరాయి చెల్లించని ప్రభుత్వం
ఫ ఇబ్బందులు పడుతున్న యజమానులు, విద్యార్థులు