
జాతీయస్థాయిలో రాణించాలి
నల్లగొండ : కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అధికారి భవేశ్‌మిశ్రా ఆకాంక్షించారు. వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది నల్లగొండ్ర కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో చేస్తున్న సాగుకు సంబంధించి మార్కెటింగ్‌పై రూపొందించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.