
నిందితులకు శిక్షపడాలి : ఎస్పీ
నల్లగొండ : నిందితులకు శిక్షపడే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అదుపు చేయడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీలు నర్సింగరావు, శివ నాయుడు.. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసుల్లో చట్ట ప్రకారం నిందితులను సెర్చ్ చేసే విధానం, స్వాధీన పరుచుకున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులకు కోర్టులో శిక్ష ఎలా పడాలనే అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, రవి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.