
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
చిట్యాల: అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రోజూ లైబ్రరీ పీరియడ్‌లను కేటాయించి విద్యార్థులు అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపు, ధారళంగా చదివే విధంగా వారిలో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. చిట్యాలలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం నిర్వహించిన ప్రభుత్వ ప్రాథమిక స్థాయి స్కూల్ క్లాంపెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గణితంలో చతుర్విద ప్రక్రియలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరరీ) పరీశీలకుడు శ్రీధరాచార్యులు మాట్లాడుతూ విద్యార్థులల్లో పఠనాసక్తి పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఎంఈఓ పానుగోతు సైదానాయక్, చిట్యాల, గుండ్రాంపలి స్కూల్ క్లాంపెక్స్ ప్రధానోపాధ్యాయులు మాధవి, వెంకట్‌రెడ్డి, ఆర్పీలు అశోక్‌రెడ్డి, అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.