
రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి
నార్కట్‌పల్లి : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. నార్కట్‌పల్లిలోని నల్లగొండ ప్లైఓవర్ ఎస్‌హెచ్–2, గోపాలయపల్లి దేవాలయ ఆర్చి వద్ద గల ఎన్‌హెచ్ 65 బ్లాక్ స్పాట్స్‌ను బుధవారం ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. నార్కట్‌పల్లి ఫ్లై ఓవర్ వద్ద గల ఎస్‌హెచ్–2 రోడ్డుపై రాత్రి సమయంలో హోటల్స్, వివిద షాప్స్‌ల వద్ద వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పైన ఉన్న షాప్‌లను హోటల్స్ పక్కకు జరిపించాలని నేషనల్, స్టేట్ హైవేల ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు జీబ్రా లైన్లు, రేడియం స్టికర్లు, హైమాస్ట్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్పించారు. కొన్ని దుకాణాలను రోడ్డుకు దూరంగా జరిపించారు. ఎస్పీ వెంట నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్, ఎన్‌హెచ్65 ప్రాజెక్టు మేనేజర్ నాగకృష్ణ, ఇంజనీర్ మధుకిరణ్, కన్సల్టెంట్ కిషన్‌రావు, ఎస్‌హెచ్–2 మెయింటెన్స్ మేనేజర్ షహదుల్లా, ఇంజనీర్ మధార్, ఏఎంవీఐ సోనిప్రియ, ఎకై ్సజ్ ఎస్‌ఐ విజయకుమార్, రిటైర్ సీఐ అంజయ్య ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్