
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మద్దిరాల: రోడ్డు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటు ంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగానితండాకు చెందిన లాకవత్ రవీందర్ బతుకుదెరువు కొరకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్‌లోనే ఓ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి కృష్ణారెడ్డి, పాపయ్య, శ్రీనివాస్, ధనుంజయ్య, సతీష్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. వారి నుంచి రూ. 8,440 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ సైదులు తెలిపారు.