
కొండగడప విద్యార్థినికి ప్రశంసలు
మోత్కూరు: మోత్కూ రు మున్సిపాలిటీలోని కొండగడప గ్రామానికి చెందిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని దొండ స్వాతి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వాతి చదువుతో పాటు విద్యార్థి దశనుంచే రచనలు, వ్యాసాలు రాస్తూ పేరుగడించారు. ఆమె రాసిన వ్యాసం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ సాహితీవేత్త ముదిగొండ శివప్రసాద్, నలిమిల భాస్కర్, ఆట్టం దత్తయ్య వ్యాసాల సరసన చోటు దక్కడంతో ఆమెకు సత్కరించారు.ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ పటేల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు స్వాతిని శాలువాతో సన్మానించి అభినందించారు.