ఘాట్‌ రోడ్డుకు తొలగుతున్న అడ్డంకులు? | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డుకు తొలగుతున్న అడ్డంకులు?

Jul 21 2025 5:11 AM | Updated on Jul 21 2025 5:11 AM

ఘాట్‌ రోడ్డుకు తొలగుతున్న అడ్డంకులు?

ఘాట్‌ రోడ్డుకు తొలగుతున్న అడ్డంకులు?

నల్లగొండ: లతీఫ్‌సాహెబ్‌ గుట్టపైకి నిర్మించే ఘాట్‌ రోడ్ల విషయంలో ఎదురైన అడ్డంకులను తొలగించే చర్యలు మొదలయ్యాయి. మత పెద్దలు అడుగుతున్న విధంగా 26 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌ నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రోడ్డు నిర్మాణ అనుకూలత విషయంలోనూ టెక్నికల్‌ రిపోర్టును మత పెద్దల ముందుంచి ఒప్పించాలని అధికారులు భావిస్తున్నారు. నల్లగొండ పట్టణం నడిబొడ్డున ఉన్న లతీఫ్‌సాహెబ్‌ గుట్టపైకి ఘాట్‌ రోడ్డు నిర్మించాలని కొన్ని సంవత్సరాలుగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మత పెద్దలు, మైనార్టీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అదేవిధంగా బ్రహ్మంగారి గుట్టకు ఘాట్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని 25 సంవత్సరాల నుంచి అక్కడి ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రెండు ఘాట్‌రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. ఘాట్‌ రోడ్డు పనులు ప్రారంభించే సమయంలో కొందరు నేతల అభ్యంతరంతో అడ్డంకులు ఏర్పడ్డాయి.

ప్రతి ఏటా ఉర్సుకు భారీగా భక్తులు..

ప్రతి సంవత్సరం లతీఫ్‌సాహెబ్‌ గుట్ట వద్ద ఉర్సు సాగుతుంది. నెల రోజుల పాటు ఉర్సు జరుగుతుంది. ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నారు. గుట్టపైకి వెళ్లాలంటే మెట్ల ద్వారా వెళ్లాలి. వృద్ధులు, చిన్నారులు గుట్టపైకి వెళ్లడం చాలా కష్టం. దీంతో ఘాట్‌ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటు లతీఫ్‌సాబ్‌గుట్టపైకి, అటు బ్రహం గుట్టపైకి రోడ్లు వేర్వేరుగా ఘాట్‌రోడ్లు నిర్మించడానికి మంత్రి రూ.140 కోట్లు మంజూరు చేయించారు. ఆ రోడ్డు నిర్మాణ పనులు ప్రభుత్వం ఆర్‌అండ్‌బికి అప్పగించింది. గుట్ట వెనుక భాగం నుంచే రోడ్లు నిర్మించేందకు టెక్నికల్‌ అధికారులు సూచించిన ప్రకారం టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే సమయంలో కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆదిలోనే ఆగిపోయాయి. గుట్ట ముందు నుంచి ఘాట్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని మత పెద్దల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. టెక్నికల్‌ పరంగా ముందు వైపు నుంచి సాధ్యం కాదని వెనుక వైపు నుంచే 3.75 కిలోమీటర్ల మేర ఘాట్‌ రోడ్లకు అధికారులు ప్లాన్‌ ఇచ్చారు. ఈ విషయంలో తలెత్తిన అపోహలు తొలగించేందుకు ఇదివరకే జిల్లా ఎస్పీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మత పెద్దల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. త్వరలోనే మరోమారు మత పెద్దలతో భేటీ అయ్యేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఘాట్‌ రోడ్డు నిర్మాణంతో పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. ఉర్సు సందర్బంలో లతీఫ్‌సాహెబ్‌ గుట్టపైకి వెళ్లే భక్తులు.. ఘాట్‌ రోడ్డు ఏర్పాటైతే నిత్యం వెళ్లవచ్చు. దుకాణాలు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉన్నందున వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా దర్గాకు ఆదాయం పెరగనుంది.

ఫ మత పెద్దలు అడుగుతున్న విధంగా 26 ఎకరాలకు ఫెన్సింగ్‌!

ఫ లతీఫ్‌సాహెబ్‌ గుట్ట ముందు వైపు

నుంచి ఘాట్‌ రోడ్డుకు లేని అనుకూలత

ఫ టెక్నికల్‌ కమిటీ రిపోర్టు ఆధారంగానే ఒప్పించేలా కసరత్తు

ఫ త్వరలో మత పెద్దలతో మరోసారి భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement