దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు
రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు తెచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జిల్లా కన్వీనర్ మహ్మద్ అబ్దుల్ బషీర్ రషాది వ ఖాస్మి అన్నారు. మంగళవారం నల్లగొండలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శించారు. సవరణ బిల్లులో పేర్కొన్న అంశాలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ బహిరంగ సభకు ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మౌలానా ఇలాలుద్దీన్, ఎండీ.నిజాముద్దీన్, నోమన్, ఎండీ.షఫినవాజ్‌ఖాన్, ఎండీ.సజ్జత్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి
మునుగోడు : ప్రతి గ్రామంలోని నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధం చేయాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడు మండలం జమస్థాన్‌పల్లి గ్రామంలోని నర్సరీ వద్ద మండల ఉపాధిహామీ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులకు హరితహారంపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్కా పెరిగి పెద్దయ్యేలా చొరవ చూపాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఇంకుడు గుంతలు తవ్వించాలని సూచించారు. వేలిముద్రలు రాని వృద్ధులు, వికలాంగుల పింఛన్‌ను కార్యదర్శుల వేలిముద్రలతో డ్రా చేసి ఇవ్వాలని.. అందుకు అది ఎంపీడీఓ అనుమతి తీసుకొవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, పంచాయితీ అధికారి స్వరూపరాణి, ఏపీఓ నాగరాజు, టెక్నకల్ అసిటెంట్లు, పీల్డ్ అసిటెంట్లు ఉన్నారు.
ఇంకుడుగుంతలు తీయాలి
పెద్దఅడిశర్లపల్లి : గ్రామాల్లో వ్యక్తిగత, సామాజిక ఇంకుడు గుంతలు తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం పెద్దఅడిశర్లపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
భూగర్భ జలాలను కాపాడుకోవాలి
త్రిపురారం : భూగర్భ జాలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కంపాసాగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త శివప్రసాద్ అన్నారు. రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రైతులకు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సంధ్యారాణి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, యువ రైతు నాయిని సంతోష్ కుమార్, పుట్టల సైదులు, సంపత్, నగేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు
దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు
దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు


